సదాశివనగర్, జూలై 31: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ నెల 27న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు.
జావెలిన్ త్రో మహిళల విభాగంలో ఎం. అమృత గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. అండర్-20 విభాగంలో బి. నవ్య గోల్డ్ మెడల్ సాధించగా, అండర్-18 విభాగంలో కే. స్వప్న సిల్వర్ మెడల్, ఎం. మహేశ్వరి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు.
పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. శోభారాణి అభినందించారు. క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణవేణి, ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి, అధ్యాపక బృందం పాల్గొని విజేతలను అభినందించారు.



