కామారెడ్డి

మహమ్మద్ నగర్ : రాహుల్ గాంధీ అరెస్ట్ కు మద్దతుగా నిరసన కార్యక్రమం

✍️ Journalist Kummari Srinivas23.07.2026 · 12:21 pm👁️ 4 వ్యూస్

మహమ్మద్ నగర్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పిలుపు మేరకు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

​కేంద్ర ప్రభుత్వ అరాచక వైఖరికి వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వేళ, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అరెస్టులతో కాంగ్రెస్ నాయకుల ధైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు