కామారెడ్డి

కౌలాస్ ఎల్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

✍️ V59 News26.07.2026 · 2:45 pm👁️ 8 వ్యూస్

కామారెడ్డి, జూలై 26 (V59 NEWS): జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ కౌలాస్ ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కౌలాస్ గ్రామానికి చెందిన న్యాయవాది అనూప్‌కుమార్ సింగ్ దొర తన కుమారుడు అన్శుల్ సింగ్ వివాహం ముగిసిన సందర్భంగా ఆలయంలో ఈ పూజలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారు ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.