కామారెడ్డి

kamareddy : కామారెడ్డిలో కిసాన్ సంఘ్ ఆత్మీయ సమావేశం

✍️ Journalist Kummari Srinivas28.07.2026 · 8:38 pm👁️ 7 వ్యూస్

కామారెడ్డి, జూలై 31: భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కిసాన్ సంఘ్ కార్యకర్తల కుటుంబాల ఆత్మీయ సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచి, రైతు కుటుంబాల అభ్యున్నతికి సమిష్టిగా కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా కృషి చేయాలని వక్తలు సూచించారు. రైతు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇటువంటి సమావేశాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి నోముల రాములు, జాతీయ కార్యవర్గ సభ్యుడు, విద్యుత్ ప్రముఖ్ మునిగంటి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రావు, శ్రీమతి ఉడుముల లావణ్యారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. ఆనందరావు, రాష్ట్ర కోశాధికారి గడ్డం మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్ది అంజన్న, రాష్ట్ర మహిళా ప్రముఖ్ ఎల్. ప్రముఖి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్‌రావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.