జుక్కల్, ఆగస్టు 14: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)లో చేరారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నియోజకవర్గ ఇన్‌చార్జ్ జాదవ్ ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్ సమక్షంలో వీరు పార్టీ కండువాలు కప్పుకున్నారు. సామాజిక న్యాయం, బీసీల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా మల్లన్న అడుగుల్లో నడుస్తామని నూతన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి
Jukkal : జుక్కల్‌లో టీఆర్పీలోకి చేరికలు




