కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు షేట్పల్లి విష్ణు జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశభక్తి నినాదాలతో వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బుడల గంగరాజు, రాథోడ్ సునీత, ధనుర్ విట్టల్, బాస పవన్, శ్రీనివాస్, గౌస్, గోపాల్ చారి, లక్ష్మణ్ చారి, సాయిరామ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




