పెద్ద కొడప్‌గల్:
ప్రధానమంత్రి నివాస ముట్టడికి యత్నించడాన్ని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రధాన చౌరస్తా వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు, కార్యకర్తలు దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సుభాష్ మాట్లాడుతూ… దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారని ఆరోపించారు. నీట్ (NEET) పరీక్షల అంశాన్ని అడ్డుపెట్టుకుని విపక్షాలు, దేశ వ్యతిరేక శక్తులు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ శ్రమిస్తుంటే, అశాంతిని రాజేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని విమర్శించారు.
ఇలాంటి విచ్ఛిన్నకర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, రాహుల్ గాంధీ తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆనంద్, సీనియర్ నాయకులు సంజయ్ పటేల్, హన్మండ్లు, తానాజీ, రాము మరియు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి
పెద్ద కొడప్‌గల్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం



