కామారెడ్డి

Buchkunda : మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీలో టెక్స్మో మోటార్ ఏర్పాటు – తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

✍️ V59 News31.07.2026 · 12:33 pm👁️ 9 వ్యూస్

బిచ్కుంద, జూలై 31: జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి ఆదేశాల మేరకు, బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి టెక్స్మో మోటార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని 3వ వార్డు కౌన్సిలర్ శ్రీ ధర్పల్లి కార్తిక్ సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

టెక్స్మో మోటార్ ఏర్పాటుతో ఎస్సీ, బీసీ కాలనీవాసుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి పరిష్కారం చూపిన ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు, కౌన్సిలర్ శ్రీ ధర్పల్లి కార్తిక్ సంతోష్‌లకు కాలనీవాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు బొగడమీద సాయిలు, అసదలి, చింతల హన్మండ్లు, వాటర్ సప్లై సిబ్బంది, రేఖల సాయిలు, గంగాధర్‌తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కౌన్సిలర్ ధర్పల్లి కార్తిక్ సంతోష్ చూపుతున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.