తీవ్రంగా ఖండించిన షెట్పల్లి విష్ణు
బిచ్కుంద: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహం సందర్భంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్పల్లి డీబీఎల్ ప్రాంగణానికి సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు షెట్పల్లి విష్ణు తీవ్రంగా ఖండించారు.
బీజేపీ మండల అధ్యక్షుడు షెట్పల్లి విష్ణుతో పాటు బుడాల గంగరాజు, దన్నూర్ విట్టల్, కమ్మరి గంగారాం, అడికేవార్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన పేరుతో ప్రతిపక్ష నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని షెట్పల్లి విష్ణు అన్నారు.
“సీఎం వస్తున్నారని బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యమా?” అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా ప్రజా గొంతును అణిచివేయలేరని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.




