బిచ్కుంద: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కూతురు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ఉదయం 9 గంటలకు బిచ్కుంద మండల కేంద్రానికి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ బిచ్కుంద మండల అధ్యక్షుడు మున్నూరు నాగ్‌నాథ్ పటేల్ తెలిపారు.
బిచ్కుందలోని డీబీఎల్ ప్రాంగణంలో జరిగే వివాహ వేడుకకు మండల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్నూరు నాగ్‌నాథ్ పటేల్ పేర్కొన్నారు.




