కామారెడ్డి

ఎల్లారెడ్డి : మెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మదన్ మోహన్..

✍️ Journalist Kummari Srinivas14.08.2026 · 5:37 pm👁️ 2 వ్యూస్

*నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం..

*మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ సోమవారం* నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే *మదన్ మోహన్* ఆవిష్కరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. *పార్టీలకు అతీతంగా* ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. జాబ్ మేళాలో *70కి పైగా ప్రముఖ కంపెనీలు* పాల్గొననున్నాయని, *5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు* అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

గత *10 సంవత్సరాలుగా తన సొంత ఖర్చులతో* జాబ్ మేళాలను నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో తొలిసారిగా కామారెడ్డిలో టాటా జాబ్ మేళాను నిర్వహించినప్పుడు యువత నుంచి విశేష స్పందన లభించిందని గుర్తుచేశారు.

*“ఒక ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే.. ఆ కుటుంబం మూడు పూటలా కడుపునిండా భోజనం చేస్తుంది”* అనే నినాదంతో నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నామని మదన్ మోహన్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి నిరుద్యోగ యువతీ యువకుడు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని తమ భవిష్యత్తుకు మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ , సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీకి చెందిన *8 మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు మండల మరియు గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*