బిచ్కుంద: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను బిచ్కుంద మండల వ్యాపారులకు కోఆప్షన్ సభ్యులు అసద్ అలీ, బొగడమీది సాయిలు గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కందర్‌పల్లి రోడ్డులోని డీబీఎల్ (DBL) వద్ద నిర్వహించనున్న వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.
వివాహ వేడుకకు మండలంలోని వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన విందులో పాల్గొని ఆతిథ్యాన్ని స్వీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.



