కామారెడ్డి

కంఠలి గ్రామంలో ఘనంగా అన్నాభావు సాఠే 106వ జయంతి వేడుకలు

✍️ V59 News10.08.2026 · 9:28 am👁️ 2 వ్యూస్

జుక్కల్ మండలం కంఠలి గ్రామంలో సాహిత్య రత్న, లోక్ షాహిర్ డాక్టర్ అన్నాభావు సాఠే 106వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గౌలే నాగనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత అన్నాభావు సాఠే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు సూర్యావంశీ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్నాభావు సాఠే సామాజిక సమానత్వం, దళితుల హక్కులు, కార్మికుల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని కొనియాడారు. ఆయన రచనలు, పాటలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు సమాజంలో అణగారిన వర్గాలకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు.

గ్రామ సర్పంచ్ గౌలే నాగనాథ్ మాట్లాడుతూ.. అన్నాభావు సాఠే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్య, సామాజిక చైతన్యం, సమానత్వ భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో శేఖ్‌పూర్ సర్పంచ్ ఇబత్వర్ తూకరం, కంఠలి సర్పంచ్ నాగనాథ్, చిన్న తడ్గురు సర్పంచ్ సూర్యావంశీ ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గులని సాయిలు, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త అయిల్వర్ రమేష్, భుజంగ్, రుశేగావు భూమయ్య, బోడ్కె హన్మంత్, గైకావాడ్ విజయ్, శ్రీరంగ్, విట్టల్ పాటిల్, పి. నాగేశ్వర్‌రావు, ఎం. సాయిలు, మారుతీ, గ్రామస్తులు మరియు అన్నాభావు సాఠే యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Kantali lo annabahu sate