కామారెడ్డి

ఎల్లారెడ్డి : కల్తీ కల్లు విక్రయిస్తే కేసులు నమోదు – ఎక్సైజ్ సీఐ

✍️ Journalist Kummari Srinivas08.08.2026 · 6:45 pm👁️ 2 వ్యూస్

కల్తీ కల్లు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ షాకీర్ అహ్మద్ హెచ్చరించారు. ఈ రోజు ఎక్సైజ్ శాఖ పరిధిలోని లింగం పేట్ మండలం రాంపూర్ (1), జల్దిపల్లి (2), కొండాపూర్ (1) కల్లు దుకాణాలను ఎక్సైజ్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు కల్లు దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. 3 గ్రామాల్లోని 4 కల్లు దుకాణాలను తనిఖీ చేసి కల్లు శాంపిల్స్ ను సేకరించి పరీక్ష నిమిత్తం నిజామాబాద్ జిల్లా ల్యాబ్ కు పంపించడం జరిగిందని ఎక్సైజ్ సీఐ తెలిపారు. కల్లు లో నిషేధిత మత్తు పదార్థాలను వినియోగించినట్లు తేలితే కేసు నమోదు చేసి, అట్టి దుకాణాల లైసెన్స్ రద్దు చేసి సీజ్ చేయడం జరుగుతోందని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎక్సైజ్ సీఐ షాకీర్ అహ్మద్, హెడ్ కానిస్టేబుల్ శ్యామల, కానిస్టేబుల్స్ సురేష్, రాకేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.