ఎల్లారెడ్డి మండలం: అజామాబాద్
సబ్‌స్టేషన్ పరిధిలోని అన్నసాగర్, వెల్లుట్ల, వెల్లుట్లపేట, ఆజాంబాద్ ఫీడర్లలో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో 11 కేవీ ఏబీసీ స్విచ్‌లను ఏర్పాటు చేశారు.
మొత్తం మూడు గ్రామాలకు ఆరు ఏబీసీ స్విచ్‌లను విద్యుత్ శాఖ అధికారులు విజయవంతంగా అమర్చారు. ఈ స్విచ్‌ల ఏర్పాటుతో ఒక ఫీడర్‌లో సాంకేతిక లోపం లేదా మరమ్మతులు అవసరమైనప్పుడు ఇతర ఫీడర్లకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నిరంతరంగా విద్యుత్ అందించే అవకాశం ఏర్పడింది.
ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా విద్యుత్ అంతరాయాలు తగ్గడంతో పాటు, లోపాలను త్వరితగతిన గుర్తించి మరమ్మతులు చేపట్టేందుకు వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందించడంలో ఈ చర్య కీలకంగా ఉపయోగపడనుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అన్నాసగర్ సర్పంచ్ స్రవంతి సాయ గౌడ్ ఏఈ వెంకటస్వామి, లైన్‌మ్యాన్ కాశిరాం, జేఎల్‌ఎం రవీందర్ పాల్గొన్నారు.


