క్రీడలు

భైరాపూర్ లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

✍️ Kummari Shankar07.08.2026 · 2:51 pm👁️ 5 వ్యూస్
  1. భైరాపూర్ (న్యూస్‌లైన్):
  2. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల విశిష్టత, చిన్న పిల్లలకు అన్నప్రాశన ప్రాముఖ్యతపై తల్లులకు ప్రత్యేక అవగాహన కల్పించారు.
  3. ​ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ (ICDS) సూపర్‌వైజర్ సుమలత గారు మాట్లాడుతూ… నవజాత శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానమని, మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని సూచించారు. అనంతరం సబ్ సెంటర్ డాక్టర్ ప్రీతి గారు మాట్లాడుతూ… పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు మరియు సరైన సమయంలో పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
  4. ​ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధారాణి & రాములు గారు, ఉప సర్పంచ్ అజయ్ గారు పాల్గొని, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు మరియు చిన్న పిల్లల తల్లులకు పలు సూచనలు చేశారు. అంగన్వాడీ సిబ్బంది మరియు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.