కామారెడ్డి

బీర్కూర్‌లో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ

✍️ Kummari Shankar12.08.2026 · 3:00 pm👁️ 2 వ్యూస్

 

 

బీర్కూర్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు బీర్కూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో “హర్ ఘర్ తిరంగా” ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుకున్నారు.

 

అనంతరం మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను అందజేయడంతో పాటు ప్రజలకు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు నాగేళ్ల సాయికిరణ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగేళ్ల సాయికిరణ్, మండల ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేశ్వర్, మండల ఉపాధ్యక్షులు హనుమాన్లు, బీజేపీ సీనియర్ నాయకులు బీరుగొండ, సాయిబాబా, ప్రవీణ్, నాగేష్, కార్యకర్తలు బసవరాజ్, శంకర్, శేఖర్, గంగు, విజయ్ తదితరులు, గ్రామ యువత పాల్గొన్నారు.