పోచారం తండాలో ఘనంగా తీజ్ పండుగ వేడుకలు
సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న బాజిరెడ్డి గోవర్ధన్
బీర్కూర్: మండలంలోని పోచారం తండాలో తీజ్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోచారం తండాకు చెందిన నరేష్ రాథోడ్ తన స్వగృహంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో తీజ్ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు జుబెర్, మొరిల్ శ్రీనివాస్, బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ, అంజిరెడ్డి తదితరులు హాజరై కార్యక్రమాన్ని శుభప్రదం చేశారు.
ఈ సందర్భంగా తీజ్ పండుగకు సంబంధించిన సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలు, యువత సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తీజ్ పండుగ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఐకమత్యంతో పండుగను నిర్వహించుకోవడం అభినందనీయమని తెలిపారు.
అనంతరం నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా మహిళలు, చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రామచందర్, తెల్ల రవి, సుదం, గంధపు సాగర్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


