క్రీడలు

హెచ్‌సీయూలో సీటు సాధించిన యువతికి ఘన సన్మానం

✍️ Kummari Shankar21.08.2026 · 12:12 pm👁️ 5 వ్యూస్

బీర్కూర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులో హిస్టరీ విభాగంలో 96 శాతం మార్కులతో సీటు సాధించిన బీర్కూర్ గ్రామానికి చెందిన మల్లెల క్యాకప్ప కుమార్తె శివ సీతన కు

 

గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ఆధ్వర్యంలో గ్రామ యువకులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ శివ సీతనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యలో మరింత రాణించి ఉన్నత స్థాయికి ఎదిగి, భవిష్యత్తులో గొప్ప ఐఏఎస్ అధికారిగా ఎదిగి తల్లిదండ్రులకు, బీర్కూర్ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి ప్రతిభతో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించడం అభినందనీయమని, ఆమెను ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని ఇతర విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సర్పంచ్ సూచించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో కుర్రి కృష్ణ, శివ యాదవ్, యోగి, చామకూర రాజు, బసవరాజ్, అరిగే శ్రీకాంత్, నవీన్, రాజశేఖర్ సార్, రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.