క్రీడలు

విద్యార్థుల సమస్యపై వెంటనే స్పందించిన పోచారం ప్రత్యేక బస్సు సర్వీస్ ప్రారంభం

✍️ Kummari Shankar21.08.2026 · 5:02 pm👁️ 5 వ్యూస్

తేదీ: 21 ఆగస్టు 2026 | బాన్సువాడ నియోజకవర్గం

 

బాన్సువాడ: విద్యార్థుల సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి, కళాశాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డికు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

 

కొల్లూరు, దామరంచ, రైతునగర్, అన్నారం, చించోలి, కిష్టాపూర్, బీర్కూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా పరిసర గ్రామాల నుంచి SRNK డిగ్రీ కళాశాలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ సమయానికి కళాశాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి వచ్చింది.

 

ఈ నెల 7వ తేదీన బాన్సువాడ నుంచి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తున్న సమయంలో కిష్టాపూర్, బీర్కూర్ పరిసర గ్రామాలకు చెందిన SRNK డిగ్రీ కళాశాల విద్యార్థులు మార్గమధ్యంలో పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి బాన్సువాడ డిపో మేనేజర్ శ్రీ రవికుమార్తో ఫోన్‌లో మాట్లాడి ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పోచారం శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు బాన్సువాడ నుంచి కొల్లూరు–దామరంచ–రైతునగర్–అన్నారం–కిష్టాపూర్–బీర్కూర్–తిమ్మాపూర్–బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా మీదుగా SRNK డిగ్రీ కళాశాల వరకు ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేశారు.ఈ ప్రత్యేక బస్సు సర్వీస్‌ను శుక్రవారం బాన్సువాడ బస్టాండులో పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్వయంగా బస్సులో SRNK డిగ్రీ కళాశాల వరకు ప్రయాణించారు.విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేక బస్సును ఉదయం, సాయంత్రం రెండు వేళల్లో నడిపించాలని బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్‌కు పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ డిపో మేనేజర్ శ్రీ రవికుమార్, SRNK డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ గంగాధర్, బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.తమ సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థినులు, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.