క్రీడలు

బైరపూర్‌లో ఘనంగా వన మహోత్సవం

✍️ Kummari Shankar25.08.2026 · 3:41 pm👁️ 4 వ్యూస్

బైరపూర్: గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుధారాణి రాములు, ఉపసర్పంచ్ అజయ్, వార్డు సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ కార్యదర్శి కృష్ణకుమారి, రైతులు, ఆశా వర్కర్లు, యువకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతు వేదిక వద్ద మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నాయకులు సూచించారు. మొక్కల పెంపకం ద్వారా పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.

వన మహోత్సవ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటడంలో భాగస్వాములయ్యారు.