
తేదీ: 19 ఆగస్టు 2026 | నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని MK గార్డెన్స్‌లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశంతో పాటు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఫేజ్-2పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TPCC అధ్యక్షులు, MLC బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సమావేశంలో ప్రభుత్వ సలహాదారు శ్రీ మహమ్మద్ షబ్బీర్ ఆలీ, జహీరాబాద్ ఎంపీ శ్రీ సురేష్ షెట్కర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రావు, మాజీ DCCB చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి, నిజామాబాద్ పట్టణ అధ్యక్షులు శ్రీ బొబ్బిలి రామకృష్ణ, నిజామాబాద్ మేయర్ శ్రీమతి ఉమారాణి, కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి ఇప్ప ఉమారాణి, ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీ తాహేర్ బిన్ హమ్దాన్, NUDA చైర్మన్ శ్రీ కేశ వేణు, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు శ్రీ గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే నిజామాబాద్ జిల్లా ఇంచార్జి DCC అధ్యక్షులు శ్రీ కే. శరత్ కుమార్, కామారెడ్డి జిల్లా DCC అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మాజీ ఎమ్మెల్సీలు శ్రీమతి ఆకుల లలిత, శ్రీ అరికెల నర్సారెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధ్యక్షులు శ్రీ ఈరవత్రి అనిల్ కుమార్, తెలంగాణ కోపరేటివ్ చైర్మన్ శ్రీ మానల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ సునీల్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, బాన్సువాడ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండాలి: మహేష్ కుమార్ గౌడ్
ఈ సందర్భంగా TPCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో బూత్ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఓటరు జాబితాల పరిశీలనలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
అర్హులైన ఒక్కరి ఓటు హక్కు కూడా కోల్పోకూడదు: సీతక్క
మంత్రి శ్రీమతి సీతక్క మాట్లాడుతూ.. BLAలు, పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోతే వాటిని తిరిగి నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అర్హత ఉన్న ఒక్కరి ఓటు హక్కు కూడా కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పోచారం భాస్కర్ రెడ్డి
మాజీ DCCB చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ స్థాయి నుంచి ప్రజలకు చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడంతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో SIR ప్రక్రియ, ఓటరు జాబితాల పరిశీలన, బూత్ స్థాయి కార్యకలాపాలు, పార్టీ సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై నాయకులు చర్చించారు.



