కామారెడ్డి

నాగుల చవితి సందర్భంగా సర్పంచ్ ధర్మతేజ ప్రత్యేక పూజలు

✍️ Kummari Shankar17.08.2026 · 1:43 pm👁️ 6 వ్యూస్

బీర్కూర్: నాగుల చవితి సందర్భంగా బీర్కూర్ మండల కేంద్రంలోని నాగుల అమ్మవారి ఆలయంలో సర్పంచ్ అరిగే ధర్మతేజ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ నాగుల అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

పూజా కార్యక్రమానికి భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నాగుల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరిగే ధర్మతేజ, అరిగే గాయత్రి, శేఖర్ యాదవ్, శివ యాదవ్, మేకల రాజు, ఈరస్ సాయిలు, శ్రీనివాస్ గౌడ్, కందకుర్తి రంజిత్, నరేంద్ర గౌడ్, గజేందర్, నారం పీరన్న, యమ చిన్న రాములు, మేకల రాములు, మన్విత్ యాదవ్, సాయిలు, పండరి, లంబు సాయిలు, ఇంగు సాయి కృష్ణ, ఇంగురాజు తదితరులు పాల్గొన్నారు.